కుషాయిగూడలో చోరీ..!
MDCL: కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న పద్మావతి కాలనీలో ఉ. 5 గంటల సమయంలో SSB అపార్ట్‌మెంట్‌లో దుండగుడు సైకిలు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై కాలనీ కమిటీల సమాఖ్య (CCS) కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.