జలమండలికి ఉత్తమ యాజమాన్య పురస్కారం

HYD: జలమండలి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకుంది. కార్మిక సంక్షేమ పథకాలు, భద్రతా చర్యలు, పారిశ్రామిక సంబంధాల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం జలమండలికి ఉత్తమ యాజమాన్య అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఎండీ అశోక్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు. కార్మికుల ఆరోగ్య శిబిరాలు, భద్రతా వారోత్సవాలు వంటి చర్యలు సంస్థకు ప్రాధాన్యం తీసుకువచ్చాయి.