నాడు ప్రత్యర్థులు.. నేడు సన్నిహితులు

అనంతపురం: హిందూపురం నియోజకవర్గంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న ఇక్బాల్, నందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల్లో స్నేహితులయ్యారు. గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీని వీడి టీడీపీలో చేరి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ప్రచారాల్లో పాల్గొననున్నారు.