మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ పరికరాలు పంపిణీ

KKD: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ రక్షణ కవచంలా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ప్రమాదంలో చిక్కుకుంటే రక్షించేందుకు ఇవి ఎంతగానో మేలు చేస్తాయని అన్నారు. ఈ మేరకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో తొండంగి మండలం దానవాయిపేటలో ఆదివారం పలువురు మత్స్యకారులకు ఎమ్మెల్యే దివ్య ట్రాన్స్ పాండర్లను పంపిణీ చేశారు.