కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా
CTR: బంగారుపాళ్యం మండలం దండువారిపల్లి గ్రామానికి చెందిన మోహన్ రాజు అనే TDP కార్యకర్త అనారోగ్యంతో ఇవాళ మరణించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డా.కలికిరి మురళీమోహన్ వారి పార్థివ దేహాన్ని సందర్శించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎన్.పి ధరణి ప్రసాద్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.