విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

MDCL: కూకట్‌పల్లి హైదర్ నగర్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, కళాశాలను నిన్న కలెక్టర్ మనుచౌదరి సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహం, తరగతి గదులను పరిశీలించి సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి మండల తహసీల్దారు స్వామి తదితరులు పాల్గొన్నారు.