గోదావరి పుష్కరాలపై సీఎస్ సమీక్ష

గోదావరి పుష్కరాలపై సీఎస్ సమీక్ష

TG: రానున్న గోదావరి నదీ పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ కందకుర్తి నుంచి భద్రాచలం వరకు 8 జిల్లాల్లో గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉందని తెలిపారు.