విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమిలి మండలం దిబ్బడిపాలేంకి చెందిన చిన్మయ ఆనంద్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిచూసి CPR చేసి వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం చికిత్స పొందుతూ ఆనంద్ మృతి చెందాడు. బాలుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.