బంగారు పతకం విజేతలకు సత్కారం
VZM: మైసూరు అవధూత దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి ఇటీవల భగవద్గీత పై ఆన్‌లైన్లో పరీక్ష నిర్వహించగా గజపతినగరానికి చెందిన కొల్లా షర్మిల, కందుల కల్పన, ఆరిశెట్టి సౌజన్య, ఇంకుల రమ్య, జోస్య, మౌనిష బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం హిందూ సమ్మేళనం సదస్సులో సభ్యురాలు బెల్లాన లక్ష్మి నరేన్ శాలువలు కప్పి ఘనంగా సత్కరించారు.