ఈ నెల 8 నుంచి ANU యువజన ఉత్సవాలు
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యువజన ఉత్సవాలను ఈ నెల 8, 9, 10 తేదీలలో జరుగుతాయని యువజన ఉత్సవాల కో-ఆర్డినేటర్ మురళీమోహన్ శుక్రవారం తెలిపారు. 6వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ఉత్సవాలను విద్యార్థుల అభ్యర్థన మేరకు 8వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్, డాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలలో పోటీలు ఉంటాయని ఆయన చెప్పారు.