'నానో ఎరువులపై రైతులకు అవగాహన అవసరం'

WNP: విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడకుండా పంట నాణ్యత, ఉత్పత్తిని పెంచడంతో పాటు డబ్బును, సమయాన్ని ఆదా చేసే నానో ఎరువులపై అన్నదాతలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఆంజనేయులు గౌడ్ కోరారు. నానో ఎరువుల వల్ల దాదాపు 50 శాతం మేర ఎరువులు ఆదా అవుతాయన్నారు. నానో ఎరువులను వాడడం ద్వారా భూమి సారం పెరుగుతుందని పేర్కొన్నారు.