రేపటి నుంచి ఆధ్యాత్మిక సభలు ప్రారంభం
KKD: పిఠాపురం పట్టణంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం 98వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో జరగనున్నాయని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆదివారం తెలిపారు. మానవత్వమే మతము, ఈశ్వరత్వము అని చాటి చెప్తూ, సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక, సేవాతత్త్వాలని సకలజనులకు ప్రసాదించడమే పీఠం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.