ఆఫ్ఘానిస్థాన్‌కు భారత్ సాయం
భారీ భూకంపం ఆఫ్ఘానిస్థాన్‌ను అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. ఈ కష్ట సమయంలో ఆఫ్ఘాన్‌కు భారత్ అండగా నిలిచింది. బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను అక్కడికి పంపింది. ఇందుకు సంబంధించిన ఫొటోను విదేశాంగశాఖ షేర్ చేసింది. అలాగే మెడిసిన్ కూడా తర్వలోనే పంపనున్నట్లు తెలిపింది.