ఓపెన్ ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం
విజయనగరం జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాళ్టి నుంచి సోమవారం13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా గజపతినగరం, ఎస్. కోట, విజయనగరం, రాజాంలలో మొత్తం ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1205 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 53 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉంటారు. కేంద్రాల్లో వెలుతురు, గాలి, ఫర్నీచర్ సదుపాయాలు కల్పించారు.