'ఆలయ వార్షికోత్సవానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం'
ADB: ఇచ్చోడ మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు MLA అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యదపూర్వకంగా కలిశారు. మండల కేంద్రంలో ఈ నెల 8న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి వారి 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా సన్నిధానం, వడిపూజ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎమ్మెల్యేతో చర్చించినట్లు స్వాములు పేర్కొన్నారు.