సీతంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
PPM: వార్షిక తనిఖీల్లో భాగంగా సీతంపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి గురువారం తనిఖీ చేశారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు ఎస్పీకి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఆనంతరం సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.