VIDEO: తోట పాలెం రహదారి ఇలా.. ప్రయాణించేది ఎలా?
SKLM: ఎచ్చెర్ల మండలం తోటపాలెం గ్రామంలో రహదారి శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటపాలెం నుండి కొత్తపేట మీదుగా అంబేద్కర్ నగర్‌కు వెళ్లే ఈ రహదారి గోతులమయంగా మారిపోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కళాశాలలకు, కూలి పనులకు వెళ్లేవారు ఈ దారి గుండా వెళ్లాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు.