హ్యూమన్ రైట్ కో-ఆర్డినేటర్‌గా చారకొండ వాసి

హ్యూమన్ రైట్ కో-ఆర్డినేటర్‌గా చారకొండ వాసి

NGKL: చారకొండకు చెందిన పవన్ కుమార్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలంగాణ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. శనివారం హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ మధు ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ప్రజలను చైతన్య పరుస్తానని, అవగాహన కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.