'మహిళలకు అండగా ప్రభుత్వం'
E.G: గృహహింస, వరకట్న, లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో మండలానికి ఒక జెండర్ రిసోర్సు సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించింది. వీటిని దేవరపల్లి, కోరుకొండ, రంగంపేట, పెరవలి, కొవ్వూరు, కడియం, గోకవరం, ఉండ్రాజవరం ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రానికి రూ. 5 లక్షల చొప్పున కేటాయిస్తుంది.