భాగ్యనగరంలో కొత్త ట్రెండ్
హైదరాబాద్ లోనూ ప్రస్తుతం 'భజన్ క్లబ్బింగ్' జోరుగా సాగుతోంది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ నైట్స్ స్థానంలో యువత ఎంచుకుంటున్న కొత్త ట్రెండ్ ఇది. 'మీనింగ్ ఫుల్ పార్టీ' అంటే ఇదే అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా హై- ఎనర్జీ కీర్తనలు, భజన్ జామింగ్ సెషన్స్ లాంటి భక్తి పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు.