విద్యార్థుల 'మాక్ అసెంబ్లీ' రచ్చ.. నవ్వులు

విద్యార్థుల 'మాక్ అసెంబ్లీ' రచ్చ.. నవ్వులు

GNTR: అమరావతి అసెంబ్లీలో విద్యార్థుల 'మాక్ అసెంబ్లీ' రక్తికట్టింది. 'ఏపీ విద్యార్థి పరిరక్షణ చట్టం-2025' బిల్లు ప్రవేశపెట్టగా సభ అంతా దద్దరిల్లింది. ప్రతిపక్ష విద్యార్థి ఎమ్మెల్యేలు లేదు అంటూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. వెంటనే మార్షల్స్ రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న వారిని బయటకు పంపడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. నిజమైన అసెంబ్లీని తలపించేలా విద్యార్థుల నటన ఆకట్టుకుంది.