ప్రమాదం అంచున విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

GNTR: పొన్నూరు మున్సిపల్ ఏరియా పరిధిలోని 2వ వార్డులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదం అంచున ఉందని స్థానికులు వాపోతున్నారు. ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు ట్రాన్స్‌ఫార్మర్‌కు అల్లుకుపోవడంతో గాలులకు, వర్షం పడేటప్పుడు మంటలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోతుందేమోనని.. వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులను కోరుతున్నారు.