రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

GDWL: గద్వాల-అయిజ ప్రధాన రహదారి మెలచెరువు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారును వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.