గిరిజన భూముల్లో అక్రమ ట్రాన్స్‌ఫార్మర్లు.!
అన్నమయ్య: పుల్లంపేట(మం) కరేపాకు రాచపల్లి గిరిజనుల భూములను కబ్జా చేసేందుకు కరెంట్ ఏఈ సహకరిస్తున్నారని CPI, AITUC నేతలు బుధవారం ఆరోపించారు. గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సిన భూమిలో రాత్రికి రాత్రే రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంపై ఏఈ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ఏఈ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు.