ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా జరిపారు. ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్, అధ్యాపకులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు 58 రోజులు కఠోర నిరాహారదీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ప్రిన్సిపాల్ కొనియాడారు.