CMRF ఖరీదైన చికిత్సలకు ఆసరాగా నిలుస్తుంది: ఎమ్మెల్యే
భూపాలపల్లి, రేగొండ, చిట్యాలలో ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు 100 మంది లబ్ధిదారులకు రూ.30,94,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ నిధి ఖరీదైన చికిత్సలకు ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. అవసరమైన సమయంలో ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.