ఎమ్మెల్యే నల్లమిల్లిని అభినందించిన సీఎం

ఎమ్మెల్యే నల్లమిల్లిని అభినందించిన సీఎం

E.G: 'మొంథా' తుఫాన్ సమయంలో ఉత్తమ సేవలందించినందుకు గానూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అభినందించారు. ఉండవల్లిలో జరిగిన అభినందన కార్యక్రమంలో భాగంగా అభినందన ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సీఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.