VIDEO: కొత్త బస్టాండ్ వద్ద 3 కిలోల గంజాయి పట్టివేత

VIDEO: కొత్త బస్టాండ్ వద్ద 3 కిలోల గంజాయి పట్టివేత

KMM: నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గురువారం అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో ఎక్సైజ్ ఎస్సై రేష్మ ఆధ్వర్యంలో సిబ్బంది బస్టాండ్‌లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని తనిఖీ చేయగా, సుమారు 3 కిలోల గంజాయి లభ్యమైందని తెలిపారు.