VIDEO: కేసీఆర్‌కు సిట్ నోటీసులు దుర్మార్గం: ఎర్రబెల్లి
MHBD: తొర్రూరు పట్టణంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులను ఇంటిగోడకు అంటించడం దుర్మార్గమైన చర్యగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ కుటుంబానికి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.