సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు: MLA

VKB: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు రూ.25 కోట్ల నష్టపరిహారం, కాగ్న నది తాగునీటి పైపులైన్ పునరుద్ధరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.