VIDEO: ఆదిలాబాద్‌లో భారీ వర్షం

ADB: జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం నుంచి చల్లనిగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాలు మావల, తాంసీ, జైనథ్, బోరాజ్‌లో సైతం వర్షం కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. సకాలంలో వర్షాలు కురవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.