అంగన్వాడీ కేంద్రాల తనిఖీ
NLG: చిట్యాల మండలం ఏపూర్‌లోని 1, 2 అంగన్వాడీ కేంద్రాలను తెలంగాణ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ సభ్యులు సరిత, చందనలు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్వ ప్రాథమిక విద్యను, సరుకుల నాణ్యతను, గర్భిణులకు, బాలింతలకు చిన్నారులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలొ వారితో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఈవో భిక్షపతి, ఎంఈవో సైదా నాయక్, ఐసీడీఎస్ సిబ్బంది ఉన్నారు.