పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు
GNTR: మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న కళావేదికలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో మంగళగిరి జోన్-2లోని 153 మంది కార్మికులకు వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం వారితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు.