డిప్యూటీ సీఎంని కలిసిన క్రీడాకారిణి

డిప్యూటీ సీఎంని కలిసిన క్రీడాకారిణి

ASR: అంతర్జాతీయ అంధుల మహిళ క్రికెట్ టీమ్ సభ్యులు మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను శుక్రవారం కలిశారు. ఫైనల్లో ప్రతిభ కనబరిచిన అల్లూరి జిల్లా పాడేరు మండలం వంటల మామిడికి చెందిన కరుణకుమారిని పవన్ కళ్యాణ్ శాలువతో సత్కరించి రూ. 5 లక్షలు నజరానా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం క్రీడా రంగానికి మంచి ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.