వెల్దుర్తి ఎంపీడీవోగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
KRNL: వెల్దుర్తి ఎంపీడీవోగా చంద్రశేఖర్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో సువాసనమ్మ నిన్న పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో కర్నూలు నుంచి చంద్రశేఖర్ రెడ్డి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.