వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ:  తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఏడు వారాల మొక్కలు ఉన్న భక్తులు ప్రదక్షిణలు చేస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు.