జిల్లాలో పెరిగిపోతున్న పాము కాట్లు
PDPL: జిల్లాలో కొద్ది రోజులుగా పాము కాట్లు పెరిగిపోతున్నాయి. 2 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 127 కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. పొలాల్లో ఫర్టిలైజర్స్ వినియోగం పెరిగాక వాటి వాసనకు కొన్ని చనిపోగా మరికొన్ని జనావాసాల మధ్యలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పాము కాట్లు పెరుగుతున్నాయి. పాము కరిచినప్పుడు సరైన టైంలో స్పందించకపోవడంతో కొందరు ప్రాణాలు విడుస్తున్నారు.