వేసవి క్రీడా శిబిరాలను ప్రారంభించిన నిర్మల రెడ్డి

SRD: జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలను టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో 10, పట్టణ ప్రాంతాలు 14 క్రీడా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు క్రీడా శిబిరాలు జరుగుతాయని పేర్కొన్నారు.