'నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ కొరత లేదు'

'నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ కొరత లేదు'

NZB: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దినేశ్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం వద్ద నెల రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని, అసత్య ప్రచారాలు నమ్మి వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. ఇంధనం కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు.