విషాదం.. పెళ్లి కూతురు తండ్రి మృతి
కృష్ణా: పెళ్లింట విషాదం నెలకొన్న ఘటన పెనడలో చోటుచేసుకుంది. మచిలిపట్నం బలరామురనిపేట వాసి వీరప్రసాద్ కూతురు వివాహాన్ని నవంబర్ 13న నిశ్చయించగా, బంధువులకు శుభలేఖలు పంచేందుకు తన సోదరుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో వీరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి ఇంట్లో విషాదం నెలకొనడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.