కోళ్ల బోనులో కొండచిలువ

BDK: చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాలనీలో రాజు ఇంట్లో గల కోళ్ల బోనులోని కోళ్లను విప్పడానికి వెళ్లినప్పుడు బోనులో 11 అడుగుల కొండచిలువ కోడిపుంజును మింగేసి ఉండడం చూసి భయాందోళనకు గురైయ్యాడు. అతను వెంటనే స్నేక్ రెస్య్కూ సభ్యలు మహేశ్, దత్తుకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని కొండచిలువను బంధించి అడవిలో వదిలేశారు.