శ్రీ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
KMR: మద్నూర్ మండలం ఎంబురా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గంలో భక్తులు మహా పాదయాత్రగా వెళ్లారు. ఈరోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు.