పక్షి ప్రమాద రహితంగా భోగాపురం విమానాశ్రయం

పక్షి ప్రమాద రహితంగా భోగాపురం విమానాశ్రయం

VZM:  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మొట్టమొదటి ఏరో డ్రోమ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ప్రకృతికి అనుకూలంగా సురక్షితమైన, సుస్థిరమైన విమానాశ్రయవాతావరణాన్ని కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.