అధికారులను బదిలీ చేయడంపై మమతా మండిపాటు
అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారుల బదిలీను వ్యతిరేకిస్తూ ఈసీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఈఓల బదిలీలు సదుద్దేశంతో జరిగినవి కావన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి, అప్పీల్ చేసుకునేందుకు సమయం లేకుండా ఈ మార్పులు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు.