శివరాత్రి జాతరలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: బొబ్బిలి డీఎస్పీ
విజయనగరం: శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్య తెలిపారు. ఆమె శనివారం రాత్రి రామతీర్థం దేవస్థానంలో ఏర్పాట్లను పరిశీలించగా, సీఐ రామకృష్ణ వివరాలు తెలియజేశారు. రెండు రోజులు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సీఐలు శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.