పిల్లలకు నేడు నుమాయిష్ ఫ్రీ ఎంట్రీ

HYD: ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా హైద్రాబాద్ నాంపల్లిలో నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ఇవాళ చిల్డ్రన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం నుమాయిష్‌కు వచ్చే స్కూల్ పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. సంబంధిత స్కూళ్లకు చెందిన ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చే పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని తెలిపారు.