పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు
ASF: జిల్లాలో 15 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. సిర్పూర్‌లో ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పట్టుబడిన వారంతా ఛత్తీస్ గఢ్ నుంచి లొంగిపోయేందుకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.