కోకాపేట.. కొత్త బాట

కోకాపేట.. కొత్త బాట

RR: స్థిరాస్తి రంగంలో సంచలనం సృష్టిస్తూ, కోకాపేటలోని నియోపొలిస్‌లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరా స్థలం రికార్డు స్థాయిలో రూ. 137 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలను వేలం వేయగా.. హెచ్ఎండీఏకు రూ. 1,356 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 28, డిసెంబర్ 3న మరో 17 ఎకరాలు వేలం వేయనున్నారు. గోల్డెన్ మైల్‌లో కనీస ధర ఎకరాకు రూ. 70 కోట్లుగా నిర్ణయించారు.