ఈవోల కొరత.. ఆలయాలకు పర్యవేక్షణ కరువు

ఈవోల కొరత.. ఆలయాలకు పర్యవేక్షణ కరువు

KMM: ఉమ్మడి జిల్లాలో ఈవోల కొరతతో ఆలయాల పర్యవేక్షణ కొరవడుతోంది. మొత్తం 600 ఆలయాలున్నాయి. ఈ ఆలయాలకు 18 ఈవో పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం 11 మంది విధులు నిర్వహిస్తుండగా వీరిపై అదనపు భారం పడటంతో పాటు భక్తులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. అటు ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, ఖాళీగా ఉన్న 7 పోస్టులను భర్తీ చేయాలని భక్తులు కోరుతున్నారు.