ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం

ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం

VSP: ఉమ్మడి జిల్లాలో ఈ నెల 04న మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం 11:30 గంటలకు అల్లూరిలో జరిగే అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు. అనంతరం విశాఖ బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నివాసానికి చేరుకుని, ఇటీవల పెళ్లైన గణేష్ కుమారుడు దంపతులను ఆశీర్వదించనున్నారు.